
పులివెందుల మన జనప్రగతి ఆగస్టు 07:-అరుదైన పునుగుపిల్లి లభ్యం అయింది వివరాల్లోకెళ్తే పులివెందుల పట్టణానికి చెందిన సతీష్ అని యువకుడు మద్దునూరు నుంచి పులివెందులకు ద్విచక్ర వాహనం ద్వారా వస్తుండగా సైదాపురం సమీపంలో రోడ్డు మార్గాన అడ్డంగా ఉన్న అప్పుడు పిల్లిని పట్టుకున్నారు పేద ఇంత జంతమని ముందుగా భావించిన వారు తర్వాత అది ఎంతో పవిత్రమైన పునుగుపిల్లిగా నిర్ధారించడం జరిగింది ఈ పునుగుపిల్లిని శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక విశిష్టమైన సేవకు ఉపయోగిస్తారని గతంలో పూర్వీకులు చెప్పేవారు ఆ ఆనవాయితీ ఇప్పుడు కూడా శ్రీవారి సేవలో ఈ పిల్లి యొక్క పొనుగుతో సేవలు చేస్తారని తెలుసుకున్నవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఈ పిల్లిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ విషయంపై టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించగా వారు సంబంధిత అటవీ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు అందజేయడం జరిగింది కానీ ఆ ఫోన్ నెంబర్లు అందుబాటు లేకపోవడంతో తిరిగి సోమవారం ప్రయత్నం చేసి తిరుమల తిరుపతికి ఈ పునుగు పిల్లిని కానుకగా ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.