అమ్మ ఒడి రిజిస్ట్రేషన్ లో గోల్ మాల్ ?

ఖాజీపేట మన జనప్రగతి జూన్ 28:6 మండలం లోని కొన్ని గ్రామ పంచాయతీలలో (పుల్లూరు మరికొన్ని) గ్రామ వాలంటీర్ల చాకచక్యంతో ఒక ఇంట్లోనే ఇద్దరు విద్యార్థులకు అమ్మ ఒడి వచ్చే విధంగా చేసిన ప్రయత్నం సఫలం
ప్రభుత్వం ఏమో షరతుల మీద షరతులు పెట్టి కరెంటు వాడకూడదు 70 శాతం హాజరు ఉండాలి ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఇన్ని షరతులు పెట్టిన వాలంటరీ లు మాత్రం అమ్మ ఒడిని నాన్న మ్మ ఒడి గా మార్చి పక్కదారి పట్టించి. ప్రభుత్వానికి నష్టపరిచే విధంగా చేయడం ఏమాత్రం సమంజసంగా లేదని కొందరి వాదన.
ఈ అమ్మ ఓడిని ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని వారి సొంత రేషన్ కార్డు ద్వారా నమోదు చేయగా మరొక పిల్లవాణ్ణి అమ్మమ్మ రేషన్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేయడంతో కాజీపేటలో సుమారు 50 మంది విద్యార్థులకు పైనే ఇలా లబ్ధి చేకూరిందని గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత పకడ్బందీగా ఉన్న ప్రభుత్వం ఇలాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని అమ్మ ఒడి రాని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.