అమ్మఒడి నో బ్రేక్
విజయవాడ మన జనప్రగతి న్యూస్:- రాష్ట్రంలో స్థానిక సంస్థల పంచాయతీ మరోసారి రాజుకుంది. ప్రభుత్వ అభిప్రాయాన్ని బేఖాతరు చేస్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుద చేయటం, ఎన్నకల నియమావళి అమల్లోకి రావటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త పథకాలు, కార్యక్రమాలే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను నిలిపేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో స్పష్టం చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేయాల్సి వస్తుంది. అంతే కాకుండా ఈ నెల పదకొండున జగన్ డ్రీమ్ స్కీమ్ అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల చేయాల్సి ఉంది.నిధుల విడుదలకు సంబంధించి జీఓ నెంబర్ 3 ను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లల విద్యా వ్యయంలో ఆర్ధిక సహాయంగా తల్లుల ఖాతాలో ఏడాదికి 15వేల రూపాయల వేయనుంది. ఎల్లుండి నెల్లూరు జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీవీతో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం యథాతథంగా కొనసాగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన జీఓ కూడా ఇప్పటికే విడుదల అయ్యిందని, కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది గ్రామీణ ప్రాంతంలో కాదు తల్లులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు లో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం సోమవారం ప్రారంభిస్తారని అయన తేల్చిచెప్పారు.