అమ్మఒడి’ ఓ సంచలన పథకంవిద్యారంగానికి అగ్రతాంబూలం : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
అమ్మఒడి’ ఓ సంచలన పథకంవిద్యారంగానికి అగ్రతాంబూలం : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జనవరి 11 : పేదవిద్యార్థినీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తేలక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగామన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన “అమ్మఒడి’ ఓ సంచలనమని, విద్యారంగానికిఅగ్రతాంబూలాన్ని ఇవ్వడమే తమప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థుల ఉజ్వలభవిష్యత్ కోసం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని కడప ఎంపీవైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మఒడి పథకంలో భాగంగా రెండవ విడత నగదుబదిలీ కార్యక్రమాన్ని అవినాష్ రెడ్డి స్థానిక రవణప్ప సత్రంబడి(ప్రభుత్వ పాఠశాల) ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న సేవలనువివరించారు. ప్రతితల్లికి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రిరుణపడి ఉండాలన్నారు. కులమత రాజకీయాలకుఅతీతంగా అర్హతే ప్రామాణికంగా ఈ పథకం అమలు అవుతుందని, అర్హతఉన్న అందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహరెడ్డి అది కారులను ఆదేశించడం జరిగిందన్నారు. 1వ తరగతి నుంచిఇంటర్ వరకు చదువుతున్న పేద విద్యార్థినీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోరూ.15 వేలు జమ కానుందన్నారు. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగారూ.35.056 కోట్లతో 25,040 మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందడంజరుగుతుందన్నారు. అంతేకాకుండా అర్హత కల్గిన ప్రతి మహిళకు ఇళ్లస్థలాన్ని ఇచ్చి ఇళ్లును కూడా ప్రభుత్వమే నిర్మించడం జరుగుతుందన్నారు.ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో పాడా ఓఎస్టీ అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డిశివశంకర్ రెడ్డి, పుర ఇన్‌చార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ మాదవక్రిష్ణారెడ్డి,ఎంఈఓ వీరారెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గోటూరుచిన్నప్ప, వురపాలక చైర్మన్ అభ్యర్థి వరప్రసాద్ తో పాటు పాఠశాలలహెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, మహిళలుపాల్గొన్నారు.