అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహం మార్పిడి ఆందోళన చేస్తున్న బంధువులు
అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహం మార్పిడి
ఆందోళన చేస్తున్న బంధువులు
తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం, మనజనప్రగతి, జూన్ 7: యాజమాన్యం దనదాహమో లేక సిబ్బంది అనుభవ రాహిత్యమో ఒక కుటుంబం శోకసంద్రంలో మునగడమే కాకుండా నిరసన బాట పాట్టేలా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి కారణమైంది. వివర్రాల్లోకి వెళితే రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన గెంజి విజయకుమార్ అనారోగ్యం కారణంగా ఈనెల 1వ తేదీన అమలాపురంలో కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. విజయకుమార్ చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీ రాత్రి 10-28 నిముషాలకు మృతి చెందాడు. అయితే ఆసుపత్రిలో ఇంకొక మృతదేహం ఉండడం ఒక బంధు వర్గం వచ్చి తమ మృతదేహం అప్పగించాలని కోరడంతో అధికారులు ఒక మృతదేహాన్ని అప్పగించారు. అయితే విజయకుమార్ బంధు వర్గం సోమవారం ఆసుపత్రికి వచ్చి తమ మృతదేహం అప్పగించామని కోరగా యాజమాన్యం నోరేళ్ళబెట్టింది అప్పటికే విజయకుమార్ మృతదేహానికి అంత్యక్రియలు ముగియడంతో బంధువర్గం ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా సరే తమ మృతదేహం అప్పగించాలని ఆందోళన చెపట్టారు. కిమ్స్ ఆసుపత్రిలో అనుభవజ్నులైన డాక్టర్స్ గానీ, సిబ్బంది గానీ లేరని గతంలో ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేసినా అధికార యంత్రాంగంలో కొంచెం కూడా చలనం లేదు. పైగా ఈ కరోనా సమయంలో రోగుల నుండి అధిక సొమ్ములు వసూళ్లు చేస్తున్నారని జనం నానుడి. అయినా కిమ్స్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, అనుభవమున్న వైద్యులు లేరని, పీజీలు, హౌస్ సర్జన్స్ తో వైద్యం చేస్తున్నారని కొడకుస్తున్న పట్టించుకొనే నాధుడే కరువైయ్యారు. ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.