YSR Kadapa
అన్ని దానాలలో కెల్లా అన్న దానం మిన్న..
చిట్వేలి డిసెంబర్ 25 అన్ని దానాలలో కెల్లా అన్న దానం మిన్న అని మాజీ సర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో ఆయన న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక విద్యావనరుల కార్యాలయ ఆవరణంలో చిట్వేలి గ్రామవాసి నందు బాయి అబ్దుల్లా జ్ఞాపకార్థం ఆయన కుమారులు కరిముల్లా ,ఆసిఫ్ ,అఖిల్, మానవతా చిట్వేలి శాఖ ద్వారా యాచకులకు పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పేదలకు కడుపు నింపడం మహా పుణ్య కార్యం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మానవతా చిట్వేలి శాఖ అధ్యక్షులు అశోక్ కుమార్ సభ్యులు ముని రావు ఉపాధ్యాయులు శ్రీనివాసులు, మహేష్, గులాం భాష తదితరులు పాల్గొన్నారు..