అధినేత ఆలోచనలు అందరికీ ఆదర్శం జగనన్న జన్మదిన వేడుకలలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
రామాపురం డిసెంబర్ 21 జగనన్న ఆలోచనలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని వై ఎస్ ఆర్ సీపీ కార్యాలయం నందు జరిగిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఎం ఎల్ సి జకియా ఖానం, జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథరెడ్డి తదితర నాయకులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలన సంక్షేమ, అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు.సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.దేశంలోనే తిరుగులేని నాయకుడిగా జగన్ ఎదుగుతున్నారన్నారు. పదికాలాల పాటు జగన్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలుతో, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సలావుద్దీన్,మాజీ డి సి ఎం ఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎం పి పి లుపోలు సుబ్బారెడ్డి, జనార్ధన రెడ్డి, జెడ్ పి టి సి అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్ పి టి సి ఉపేంద్రా రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు దశరథ రామిరెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, అలీనవాజ్ ఖాన్, హాబీబుల్లా ఖాన్ మహమ్మద్ ఖాన్, చిదంబర్ రెడ్డి,ఫయాజుర్ రవామన్, సలీం, ఆనంద్ రెడ్డి, జిన్నా షరీఫ్, కొలిమి ఛాన్ బాషా,పల్లపు రమేష్, జాకీర్, విజయభాస్కర్, నరసింహా రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,యదుభూషన్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, మదన మోహన్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి శ్యామ్, కొత్తిమీర ప్రసాద్, గువ్వల బుజ్జిబాబు, రమేష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.