Andhra PradeshLatest NewsPoliticalTelangana
అఖిలేష్ ఇంట్లో కరోనా కలకలం.. భార్య, కుమార్తెకు

పాజిటివ్
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు కుమార్తెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని డింపుల్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని డింపుల్ యాదవ్ సూచించారు.