అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన సిపిఎం పార్టీ
పెనుకొండ జనవరి 11 :- పెనుకొండ నియోజక వర్గం, పరిగి మండలం నిజం షుగర్ ఫ్యాక్టరీ వద్ద గత 19 రోజుల నుండి రైతులు మరియు సిపిఎం నాయకులు సామరస్యంగా ఆందోళన చేస్తున్నారు.బలవంతంగా పోలీసులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులును, సిపిఎం నాయకులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రైతులు బాధ అర్థం చేసుకొని రైతులకు భూములను తిరిగిఇవ్వాలని గత 1978 సంవత్సరంలో రైతుల భూములు షుగర్ ఫ్యాక్టరీ కోసం భూములు తీసుకొని ఇప్పుడు అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ,రైతు కుటుంబాలకు ఉద్యోగం కల్పించకపోగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఓత్తా సు పలుకుతున్నా రెవెన్యూ అధికారులు రెండు రోజుల కిందట ప్రైవేటు సర్వేలతో షుగర్ ఫ్యాక్టరీ భూములు సర్వే చేయడానికి వస్తే రైతులుఅడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో గారు ప్రభుత్వ సర్వే ర్లు తో కొలతలు వేస్తామని హామీ ఇచ్చారు .అక్రమ లేఅవుట్లు వెంటనే ఆపాలని రైతుల సమస్యలు ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని సిపిఎం పార్టీ కోరుతున్నది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్ ,సిఐటియు మండల కార్యదర్శి బాబావలి ,రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.