అంతర్జాతీయ క్రీడాకారిణికి ముక్క దంపతుల ఆర్థిక సహాయం.
అంతర్జాతీయ క్రీడాకారిణికి ముక్క దంపతుల ఆర్థిక సహాయం.
చిట్వేల్ మన జనప్రగతి అక్టోబర్ 22:-
చిట్వేలు మండలం కేకే వడ్డిపల్లి గ్రామానికి చెందిన చల్ల ప్రసాద్, అనురాధ దంపతుల ప్రథమ పుత్రిక కుమారి విశాలాక్షి కి ప్రముఖ పారిశ్రామికవేత్త వైసిపి సీనియర్ నాయకులు టిటిడి బోర్డు సభ్యులు ముక్క. రూపానందరెడ్డి, వరలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ముక్క వరలక్ష్మి మాట్లాడుతూ విశాలాక్షి కి చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే ఎంతో ఇష్టం ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు కేకే వడ్డిపల్లి లోనీ ప్రాథమిక పాఠశాలలోను, 6 నుండి 10 వరకు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్వేల్ లోను ఇంటర్మీడియట్ అర్చన డిఫెన్స్ అకాడమీ రాయచోటి, డిగ్రీ గుంటూరు లోనీ నాగార్జున యూనివర్సిటీ లో సెకండ్ ఇయర్ చదువుతోంది కబడ్డీ అంటే ఆమెకు చాలా ఇష్టం. చదువుతునే కబడి పైన ఎంతో ఆసక్తి చూపుతుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లాలో కబడ్డీ కి స్టేట్ లెవెల్ లో విజయం సాధించింది. అదే సంవత్సరం విజయవాడలో స్టేట్ లెవెల్ లోను, 2014లో ప్రకాశం జిల్లాలో స్టేట్ లెవెల్ లోను, 2019లో గుంటూరులో స్టేట్ లెవెల్ లోనూ విజయం సాధించి 2017 కర్ణాటకలో నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అయింది. 17/9/2021 న హర్యానాలో నేషనల్ పోటీలో విజయం సాధించింది, 16 నా నేపాల్ లో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించింది. ఇలాంటి పేద క్రీడాకారిణిని ప్రోత్సహించేందుకు తమ వంతు ఆర్థిక సహాయం అందజేసామని, ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించవలసిందిగా వారు కోరారు. అనంతరం క్రీడాకారిణి విశాలాక్షి కి వరలక్ష్మి స్వీట్లు తినిపించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బత్తిన వేణుగోపాల్ రెడ్డి, సింగనమల మహేందర్ రెడ్డి, రఘునాథ రెడ్డి, పామూరి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.